భద్రాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి

అశ్వారావుపేట, వెలుగు : మూడేండ్ల చిన్నారిపై 17 ఏండ్ల బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలో జరిగింది. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూడేండ్ల చిన్నారి గురువారం ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ టైంలో ఓ బాలుడు చిన్నారిని ఆటోలో గ్రామ శివారులోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారిని స్థానికులు గమనించి ఆమె తల్లికి చెప్పారు. ఆమె వచ్చి ఆరా తీయగా లైంగికదాడి విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. 

మొయినాబాద్‌‌లో...

చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌ మండలం చిలుకూరు గ్రామంలో నాలుగేండ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. గద్వాల జిల్లా ధరూర్‌‌ మండలం నల్లపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబం చిలుకూరుకు వలస వచ్చారు. ఆ ఫ్యామిలీకి చెందిన నాలుగేండ్ల చిన్నారిపై గురువారం సాయంత్రం ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో ఆమె అక్క గమనించి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం మొయినాబాద్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.