షబ్బీర్​అలీని కలిసిన బాక్సింగ్​ఛాంపియన్ నిఖత్​జరీన్ 

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీని ప్రపంచ బాక్సింగ్​ఛాంపియన్, ఒలింపిక్ అథ్లెట్​నిఖత్​జరీన్ ఆదివారం హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నిఖత్​ను ఇటీవల డీఎస్పీగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకానికి కృషి చేసిన షబ్బీర్​అలీని కుటుంబసభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.‌‌‌‌ - కామారెడ్డి