బూత్​లెవల్​ ఏజెంట్లను నియమించుకోండి : కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : ఆయా పార్టీలు బూత్​లెవల్​ఏజెంట్లను నియమించుకోవాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిశ్​ సంగ్వాన్​ సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో ఆయా పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలన్నారు.  అక్టోబర్​ 29న  ఇంటిగ్రేటెడ్​ డ్రాప్ట్ రోల్​ ప్రచురిస్తామన్నారు.  

నవంబర్​ 9,10 తేదీలలో స్పెషల్​ క్యాంపెయిన్​ నిర్వహిస్తామన్నారు.   ఫైనల్​ ఓటర్​ లిస్టు 2025 జనవరి  6న ప్రకటిస్తామని తెలిపారు.  జిల్లాలో  ఓటరు జాబితా కోసం ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామన్నారు.   కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.