ఎంబీబీఎస్​ స్టూడెంట్​కు బుక్స్​ అందజేత

కామారెడ్డి టౌన్, వెలుగు : లింగంపేట మండలం అయ్యవారిపల్లి తండాకు చెందిన పేద విద్యార్థిని స్వర్ణ ఎంబీబీఎస్​ చదువుతోంది. బుక్స్​ కొనేందుకు ఆర్థికంగా ఇబ్బందవడంతో కామారెడ్డికి చెందిన శ్రీరామ్ సేవా సమితి వారు  4వ ఏడాది బుక్స్​ అందించారు.

రూ.10,150 విలువైన బుక్స్​ను శనివారం స్టూడెంట్​ తండ్రి శ్రావణ్​కు అందజేశారు.  గందె నర్సింలు, ఉప్పల గిరిధర్, లాభిశెట్టి కిషన్, తాటిపల్లి సునిల్, కె. సురేశ్, పప్పుల శ్రీనివాస్, మామిడి శ్రీనివాస్, ఎల్లంకి కృష్ణ, మోత్కూరి శ్రీనివాస్​ పాల్గొన్నారు.