రైతుల ఖాతాల్లో రూ.30.20 కోట్ల బోనస్ జమ

కామారెడ్డి, వెలుగు:   ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ​ప్రభుత్వం సన్నరకం ధాన్యాన్ని పండించిన రైతుల ఖాతాల్లో బోనస్​జమచేస్తోంది. క్వింటాల్​కు రూ.500  చెల్లిస్తోంది.  కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో రూ. 30.20 కోట్లు జమయ్యాయి.   జిల్లాలో వానాకాలం సీజన్​లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగయితే, ఇందులో  సన్న రకం 95,423 ఎకరాల్లో సాగయ్యింది.  ప్రైవేట్​ వ్యాపారులకు కొంతమంది రైతులు ధాన్యాన్ని విక్రయించారు.

 గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ సీజన్​ నుంచి సన్నాలకు బోనస్​ చెల్లిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలో అమ్మిన రైతులకు కూడా క్వింటాల్​కు రూ.500 చెల్లిస్తోంది.  ధాన్యం కొనుగోలుకు 424 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఇందులో సన్న రకం ధాన్యం కోసం 64 సెంటర్లు ఉన్నాయి.   ఇప్పటి వరకు సన్నరకం ధాన్యాన్ని 12,224  మంది రైతుల నుంచి  84,190 మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేశారు.  8,920 మంది రైతుల అకౌంట్లలో  రూ.30.20 కోట్లు చెల్లించారు.  కనీస మద్దతు ధరతోపాటు బోనస్​  జమయ్యేలా చర్యలు చేపట్టామని  జిల్లా అగ్రికల్చర్​ఆఫీసర్​ తిరుమల ప్రసాద్​ తెలిపారు.