ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లోఖండ్ వాలాలో ఓ వీధికి దివంగత నటి శ్రీదేవి పేరు పెట్టారు. ‘శ్రీదేవి కపూర్ చౌక్’ పేరుతో రాసి ఉన్న శిలాఫలకాన్ని ఆమె భర్త బోనీకపూర్, కూతురు జాన్వీ కపూర్ ఆవిష్కరించారు. ఆ శిలాఫలకం నలువైపులా శ్రీదేవి ఫొటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి ఫొటోకు మొక్కి బోనీ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, అనుపమ్ ఖేర్, పూనమ్ ధిల్లాన్ పాల్గొన్నారు.
కార్యక్రమానికి సంబంధించిన వీడియోను బోనీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్రీన్ ఏకర్స్ టవర్ వద్ద ఈ చౌక్ ఉంది. ఈ టవర్స్ లోనే శ్రీదేవి కొన్నేండ్ల పాటు నివసించింది. కాగా.. శ్రీదేవి కపూర్ చౌక్ ను ప్రారంభించడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. వీధులకు రతన్ టాటా లాంటి లెజెండ్ల పేరు పెట్టాలి తప్ప నటుల పేర్లు కాదని కొందరు అభిప్రాయపడ్డారు.