శివమూగిన భాగ్యనగరి

 హైదరాబాద్​, వెలుగు: వేపాకుల తోరణాలు. పోతరాజుల విన్యాసాలు. శివసత్తుల పూనకాలు. అమ్మవారి పాటల నడుమ భాగ్యనగరంలో ఆదివారం బోనాల పండుగ సందడి నెలకొంది. అమ్మవారిని, ఆలయాలను అందంగా అలంకరించారు. తెల్లవారు జామునుంచే అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లిస్తూ.. నైవేధ్యంగా బోనాలు సమర్పించారు.​ లాల్​దర్వాజ, అక్కన్న మాదన్న, భాగ్యలక్ష్మి, దర్బార్ మైసమ్మ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.