మంగల్ పాడ్ గ్రామంలో ఘనంగా బోనాల పండగ

మండలంలోని మంగల్ పాడ్ గ్రామంలో ఆదివారం బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  ప్రతిఏటా పంటలు చేతి కొచ్చే సమయంలో  పోచమ్మకు  బోనాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ.

బోధన్ మండలంలోని లంగ్డాపూర్​లో ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగ నిర్వహించారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిఏటా వానాకాలం వరికోతల ప్రారంభంలో బోనాల పండుగా నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు.

 

 

 - ఎడపల్లి, బోధన్​వెలుగు