బోధన్లో గ్రామ దేవతలకు బోనాలు

బోధన్, వెలుగు : బోధన్​ పట్టణ రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం కార్తీకమాసం  పురస్కరించుకొని  గ్రామ దేవతలకు బోనాల ఉత్సవం నిర్వహించారు.  పట్టణ శివారులోని పసుపువాగు నుంచి బోనాలతో మహిళలు ఊరేగింపుగా  బెల్లాల్​ చెరువు కట్టపై ఉన్న పాప నాగమ్మ  ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి పూజలు చేసి బోనాలను నైవేద్యంగా  సమర్పించారు.