Beauty Tips : చర్మ రోగాలు రాకుండా ఉండాలంటే వీటిని మానేయండి

చర్మం అందంగా కనిపించాలని రకరకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే, వాటిలో కెమికల్స్ ఉండటం వల్ల స్కిన్ పాడవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే... వాటిని వాడటం మానేయాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. 

* ముఖం కడుక్కునేందుకు ఫేస్ వాష్ లేదా ఫేస్ కోసం స్పెషల్గా ఉండే సోప్ మాత్రమే వాడాలి. ఒంటికి వాడే సోప్ ఫేసి వాడితే స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది. 

* జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పెట్రోలియం జెల్లీ రాస్తే పగుళ్లు, మచ్చలు ఎక్కువ అవుతాయి. అందుకని ముఖానికి ఏదైనా రాయాలంటే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అవి కూడా హెల్దీ ప్రొడక్ట్స్ వాడి తయారుచేసినవైతే స్కిన్ లో కలిసిపోతుంది. 

* మొటిమలు, మచ్చలు పోవడానికి టూత్పేస్ట్ వాడుతుంటారు. అందులో ఉండే కెమికల్స్ స్కినికి సరిపడకపోతే చర్మం కాలిపోతుంది. 

* బాడీలోషన్ ని కూడా ముఖానికి, మెడకు రాస్తుంటారు. వాటిలో హెవీ కెమికల్స్ వాడతారు. దాంతో బాడీ లోషన్స్ వాడటం వల్ల కూడా చర్మం సున్నితంగా మారుతుంది.