శాబ్దులపురంలో తండ్రీకొడుకు డెడ్ బాడీలు లభ్యం

  • స్నానం చేసేందుకు ఎమ్మార్పీ కాలువలోకి దిగి గల్లంతు

నల్గొండ అర్బన్, వెలుగు : ఏమ్మార్పీ ప్రధాన కాలువ లో గల్లంతైన తండ్రీకొడుకుల మృతదేహాలు ఆదివారం దొరికాయి.  నల్గొండ జిల్లా కనగల్లు మండలం శాబ్దులపురం గ్రామానికి చెందిన సురవరం దామోదర్, అతని కొడుకు ఫణీంద్ర వర్మ శనివారం గ్రామ సమీపంలోని ఏమ్మార్పీ  ప్రధాన కాలువ వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాతూ కాలుజారి కాలువలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో తండ్రీకొడుకుల  ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు, గ్రామస్తులు గాలింపు చేపట్టారు.  

ఆదివారం ఉదయం నల్గొండ మండలం గుండ్లపల్లి ప్రధాన కాలువ వద్ద దామోదర్(39) డెడ్ బాడీ కనిపించింది. అనంతరం ఫణీంద్ర వర్మ(14) డెడ్ బాడీ కోదండపురం కాలువ వద్ద దొరికింది. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  తండ్రీకొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు దామోదర్ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కనగల్ ఎస్ఐ పి.విష్ణు తెలిపారు.