- సబ్ కలెక్టర్ వికాస్ మహాతో
బోధన్, వెలుగు: విద్యార్థి దశ నుండే క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ ప్రైవేట్ పాఠశాలలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించారు. ముందుగా క్రీడల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని,ఫలితంగా ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపుఓటములు సహజమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, పట్టణ సీఐ వి.వెంకట నారాయణ, ఎంఈవో నాగయ్య, ఎంపీడీవో బాలగంగాధర్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, అబ్దుల్లా, అలీం రజా, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.