- ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తాం
- ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నవీపేట్, వెలుగు: ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలం లోని కోస్లీ గోదావరి నది వద్ద అల్లీసాగర్ పంపులను స్టార్ట్ చేసి మాట్లాడారు. ఒక సిస్టం ప్రకారం రుణమాఫీ చేస్తారని, కొన్ని సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం సర్వే చేపట్టామన్నారు. గోదావరిలో నీరు తక్కువగా ఉనందున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు.
కార్యక్రమం కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందన్, కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు గడుగు గంగాధర్, పార్టీ మండల నాయకులు ఇరిగేషన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందంటూ సెక్రటరీపై మండిపడ్డారు. మోడల్ స్కూల్ కు వెళ్లేందుకు కెనాల్ పై నిర్మించనున్న బిడ్జికి భూమి పూజ చేశారు.