రోజూ 7 గ్లాసుల పాలు తాగేవాడిని.. ఇప్పుడు మలబద్దకంతో బాధపడుతున్నా : స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా తీసుకుంటే ఏదైనా విషమే అవుతుంది. ఈ నానుడి సదరు బాలీవుడ్ స్టార్ హీరోకు సరిగా సరిపోతుంది. ఫిట్నెస్ మీద దృష్టి పెట్టడమో, లేక ఇష్టంతోనో పాలు ఎక్కువగా తాగటం వల్ల మలబద్దకంతో బాధపడుతున్నానని అంటున్నారు సీనియర్ హీరో బాబీ డియోల్. ఒకానొక సమయంలో రోజుకు 7 నుండి 8గ్లాసుల పాలు తాగేవాడిని అని, ఎక్కువ పాలు తాగేందుకు ప్రత్యేకంగా  పెద్ద సైజు గ్లాసు ఉండేదని, తన తండ్రి ధర్మేంద్ర ఆ గ్లాసును గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పుకొచ్చారు బాబీ  డియోల్. పాలు ఎక్కువగా తాగటం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కుంటున్నానని రియలైజ్ అయినట్లు తెలిపారు బాబీ డియోల్.

పాలు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయి. బాల్యంలో పాలు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది అని అందరికి తెలిసిన విషయమే. అయితే, వయసు పెరిగే కొద్దీ పాలు తీసుకునే మోతాదు తగ్గించాలి.వయసు పెరిగాక పాలు ఎక్కువగా తాగితే లాక్టోస్ ఇంటాలరెన్స్, బరువు పెరగటం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

ఇటీవల కాలంలో కల్తీ పాలు ఎక్కువైన నేపథ్యంలో పాలు తాగటం వల్ల కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా చేస్తున్న కల్తీ వల్ల పాలు క్యాన్సర్ కు కూడా దారి తీస్తున్నాయి. కాబట్టి పాలే కదా అని లీటర్లు లీటర్లు తాగేయకుండా లిమిట్ గా తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.