ఎమర్జెన్సీ టైంలో ‘బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దొరకట్లే..

  •  గర్భిణులు, యాక్సిడెంట్ల బాధితులకు తప్పని అవస్థలు 
  •  బ్లడ్ అవసరమైతే జగిత్యాలకు పరుగులు పెట్టాల్సిందే..
  •  డయాలసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాధితుల పరిస్థితి అంతంతమాత్రమే
  •  మూడు డయాలసిస్​సెంటర్లున్నా టైంకు బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరకడం లేదు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు ఎమర్జెన్సీ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరకక అవస్థలు పడుతున్నారు. ఎమర్జెన్సీ టైంలో గర్భిణులు, యాక్సిడెంట్ బాధితులకు ఆయా స్థానిక హాస్పిటళ్లలో బ్లడ్​ దొరకక జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన పరిస్థితి. ఇలా పేషెంట్లను తరలించే క్రమంలో మార్గమధ్యంలో ప్రాణాలు పోతున్నాయి. మరో వైపు డయాలసిస్ పేషంట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. జిల్లాలో మూడు సెంటర్లు ఉన్నా బ్లడ్ బ్యాంకులు లేక డయాలసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవస్థలు పడుతున్నారు. 

అత్యవసరమైతే 30 కిలోమీటర్లు వెళ్లాల్సిందే 

జిల్లాలో ప్రతినెలా పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లోనూ గర్భిణుల డెలివరీల టైంలో బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం ఉంటుంది. ఈక్రమంలో ప్రతినెలా వందల యూనిట్ల బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాల్సి ఉండగా.. బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు అందుబాటులో లేవు. కేవలం జగిత్యాల జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా నెలకు సుమారు 350–400 యూనిట్ల బ్లడ్ సేకరిస్తున్నారు.

ఇందులో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుదున్న రోగులకు ఫ్రీగా 150 యూనిట్లకు పైగా అందజేస్తుండగా, ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రులో చికిత్స పొందుతున్న రోగులకు కూడా అందజేస్తున్నారు. ఈ లెక్కన  జిల్లాకేంద్రంలో సరిపడ బ్లడ్ యూనిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ మిగతా పట్టణాలు, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలకు ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ అందని పరిస్థితి. దీంతో ఎమర్జెన్సీ టైంలో 20-–30 కిలోమీటర్లు వెళ్లి బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెచ్చుకోవాల్సి వస్తుందని పేషెంట్లు వాపోతున్నారు. 

రెండు నెలల ముందే రిజిస్ట్రేషన్​​ చేసుకోవాలి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా డయాలసిస్ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతేడాది జిల్లా ప్రధాన హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోపాటు కోరుట్ల, ధర్మపురి ఏరియా హాస్పిటళ్లలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కానీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇక్కడి డయాలసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్లకు సరిపడా బ్లడ్​ అందడం లేదు. కనీసం నెల నుంచి 2 నెలల ముందే రిజిస్ట్రేషన్​ చేసుకుంటేనే బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరుకుందని డయాలసిస్ పేషెంట్లు చెబుతున్నారు.