ఆర్మూర్‌‌‌‌లో రక్తదాన శిబిరం

ఆర్మూర్, వెలుగు: ఎమ్మార్పీఎస్​ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా ఆదివారం ఆర్మూర్‌‌‌‌లో ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్​ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి మైలారం బాలు, జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, ఆర్మూర్ మండల కమిటీ అధ్యక్షుడు నాగం శ్రీనివాస్  హాజరై ఎమ్మార్పీఎస్​ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం ర్యాలీ నిర్వహించారు.  ఎమ్మార్పీఎస్​, ఎంఎస్​పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.