తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం...78 యూనిట్ల రక్తసేకరణ

కామారెడ్డిటౌన్, వెలుగు : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం కామారెడ్డి రక్తదాతల సముహం, ఇంటర్నేషనల్​ వైశ్య ఫెడరేషన్, ఇండియన్​ రెడ్​క్రాస్​ సోసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డిలోని కర్షక్​ బీఈడీ కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

78 మంది రక్తదానం చేశారు. ఇందులో రెడ్​క్రాస్​ సొసైటీ జిల్లా చైర్మన్​ బాలు, రక్తదాతల సముహం జిల్లా ప్రెసిడెంట్​ వేదప్రకాశ్​​, జనరల్​ సెక్రటరీ గంగా ప్రసాద్​, ప్రతినిధులు అనిల్​కుమార్​, కిరణ్​, చంద్రశేఖర్​, జైపాల్రెడ్డి, గురువేందర్​రెడ్డి, చంద్రశేఖర్​, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.