వేములవాడలో బ్లడ్​ బ్యాంక్​ ఏర్పాటు : విప్​ ఆది శ్రీనివాస్

  • ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయ్యి గజాల స్థలం కేటాయింపు

వేములవాడ, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కానుంది.  బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంకు కోసం వేములవాడ ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1000 గజాల స్థలం కేటాయించారు. విప్​ ఆది శ్రీనివాస్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వసంతరావు శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు స్థల కేటాయింపు పత్రాలు అందజేశారు. బ్లడ్​బ్యాంక్ ఏర్పాటుతో వేములవాడ ప్రాంతంతోపాటు జిల్లా ప్రజలకు అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి కష్టాలు తప్పనున్నాయి. 

పేదలకు అందుబాటులో బ్లడ్​ బ్యాంక్​..

రాజన్నభక్తులతో పాటు సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వేములవాడలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయిస్తున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు, గవర్నర్​చేతులమీదుగా త్వరలో భూమిపూజ చేస్తామన్నారు. బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ బిల్డింగ్ నిర్మాణానికి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెయ్యి గజాల స్థలం కేటాయించామన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో మైనర్​ ఓటీ విభాగాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు.