వాతావరణం మారినా.. ఎండలో కాస్త ఎక్కువగా తిరిగినా ముఖం మీద చిన్న కురుపులు వస్తుంటాయి. చాలామంది వాటిని గోళ్లతో గిల్లుతుంటారు. దాంతో అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి, నల్లగా మచ్చ పడుతుంది. అలాంటి వాళ్లు ఈ బ్లాక్‌హెడ్ రిమూవర్ వాక్యూమ్ వాడితే సరిపోతుంది. మొటిమలతో పాటు ముక్కు మీద ఉండే బ్లాక్‌హెడ్స్‌ని కూడా తొలగిస్తుంది. దీన్ని బిన్స్‌బార్రీ అనే కంపెనీ తయారుచేసింది. ఇది అన్ని రకాల చర్మాలకు సరిపోతుంది. లెవల్ 1 నుండి లెవల్ 3 వరకు సక్షన్ కంట్రోల్స్ ఉంటాయి. చిన్న బ్లాక్ హెడ్స్‌కి లెవల్ 1తో వ్యాక్యూమ్ చేయాలి.
మొండిగా ఉండే బ్లాక్‌హెడ్స్ తొలగించడానికి లెవల్ 3 స్ట్రాంగ్ సక్షన్ వాడాలి. ఇది వాక్యూమ్ అబ్జార్ప్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. పవర్ ఫుల్ సక్షన్ కెపాసిటీ ఉండడం వల్ల బ్లాక్ హెడ్స్‌తోపాటు వైట్ హెడ్స్, డెడ్ స్కిన్, మురికి, మేకప్ పార్టికల్స్ కూడా తొలగించొచ్చు. దానివల్ల చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రెండు నుంచి ఐదు వారాలు రెగ్యులర్‌గా వాడితే.. చర్మం మృదువుగా, ఆరోగ్యవంతంగా మారిపోతుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్ పెట్టొచ్చు. ఇందులో హై కెపాసిటీ లిథియం బ్యాటరీ ఉంటుంది. ఎల్‌ఈడీ డిస్‌ప్లేలో సక్షన్ లెవల్ కనిపిస్తుంది. ఈ గాడ్జెట్‌తోపాటు వివిధ సైజుల్లో ఆరు సక్షన్ హెడ్స్ వస్తాయి. దీన్ని నాన్-టాక్సిక్, నాన్–ఇరిటేటింగ్ ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్‌తో తయారుచేశారు.
ధర : 449 రూపాయలు
స్పాక్యాప్
చాలామంది ఆడవాళ్ల జుట్టు పొడవుగా ఉంటుంది. పొడవైన జుట్టుకు కాస్త ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది రెగ్యులర్‌గా హెయిర్ స్పా చేయించుకుంటుంటారు. అందుకోసం ప్రతిసారి స్పా సెంటర్లకు వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా హెయిర్ స్పా క్యాప్ ఉంటే ఇంట్లోనే స్పా చేసుకోవచ్చు. విట్‌జెర్ అనే కంపెనీ దీన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది జుట్టు కుదుళ్లకు, జుట్టుకు తేమను అందిస్తుంది. దాంతో జుట్టు మృదువుగా కనిపిస్తుంది. జుట్టును అందంగా కనిపించేలా చేయడమే కాదు చుండ్రును తొలగించడంలో కూడా సాయ పడుతుంది. ఈ స్పా క్యాప్‌లో టెంపరేచర్‌ని అడ్జెస్ట్ చేయడానికి మూడు మోడ్స్ ఉంటాయి. క్యాప్ లోపలి భాగంలో వాటర్‌ప్రూఫ్, యాంటీ ఎలక్ట్రిసిటీ ఎంబడెడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ ఉంటుంది. ఈ క్యాప్‌ని శుభ్రం చేయడం చాలా ఈజీ.
ధర: 399 రూపాయలు
హెయిర్ స్ట్రెయిట్నర్ బ్రష్
మార్కెట్‌లో ఇప్పటికే రకరకాల హెయిర్స్ట్రెయిట్నర్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోలిస్తే.. హెయిర్ స్ట్రెయిట్నర్ బ్రష్‌లు వాడడం కాస్త ఈజీ. ఈ బ్రష్‌ని వెగా కంపెనీ తయారుచేసింది. దీనికి కెరటిన్, అర్గన్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ సెరామిక్ కోటెడ్ ప్లేట్స్ ఉంటాయి. అంతేకాదు.. ఇందులో ఇదివరకు వాడినప్పుడు సెట్ చేసిన టెంపరేచర్‌ని గుర్తుపెట్టుకునే స్మార్ట్ మెమరీ ఫంక్షన్ ఉంది.
ఏ రకం జుట్టుకి అయినా ఇది బెస్ట్ ఛాయిస్. ఈ బ్రష్‌లో 5 టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి. 120 డిగ్రీల సెంటిగ్రేడ్ల నుంచి 230 డిగ్రీల సెంటిగ్రేడ్ల వరకు సెట్ చేసుకోవచ్చు. ఆటో షటాఫ్ టెక్నాలజీ వల్ల వాడకుండా పక్కన పెడితే 30 నిమిషాల్లో ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. అంతేకాదు.. రెండు సంవత్సరాల బ్రాండ్ వారెంటీ కూడా ఉంది.
ధర : 2,249 రూపాయలు
ఎలక్ట్రిక్ మసాజర్
ఇంట్లో ఉంటున్నమాటే గానీ.. చాలామంది ఆడవాళ్లు పొద్దంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకైతే డబుల్ డ్యూటీ చేసినట్టే. ఒక పక్క ఇల్లు చక్కబెట్టాలి. మరో పక్క ఆఫీస్ వర్క్ చూసుకోవాలి. అంతలా పని చేయడం వల్ల భుజం, వెన్ను, కాళ్లు, కండరాల నొప్పులు లాంటివి వస్తాయి. అలాంటివాళ్లు ఈ ఎలక్ట్రిక్ మసాజర్‌తో మసాజ్ చేసుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది.
అగారో కంపెనీ తయారుచేసిన ఈ గాడ్జెట్‌తోపాటు ఎనిమిది రకాల మసాజ్ హెడ్స్ వస్తాయి. శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కో హెడ్‌తో మసాజ్ చేసుకోవాలి. ఇది కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. ఈజీగా వాడుకోవచ్చు. పెర్క్యుషన్ టెక్నాలజీ వల్ల డీప్ టిష్యూ స్టిమ్యులేషన్ చేస్తుంది. దాంతో నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ధర : 1,477 రూపాయలు
నిర్వహణ: సగన్