Face Beauty Tips:ముఖంపై నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి.. తగ్గాలంటే ఏం చేయాలి

ఫేస్ పై నల్ల మచ్చాలు వచ్చాయంటే జనాలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్క చిన్న మచ్చ ఉన్నా ఫేస్​ అందాన్ని దెబ్బతీస్తుంది  వాటిని తగ్గించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది బ్లాక్​ హెడ్స్​  వేధిస్తున్నాయి.  ఇవి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తాయి.  అసలు ఇవి ఎందుకు ఏర్పడుతాయో.. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.  .

చర్మంపై చిన్న చిన్న కురుపుల్లాగా ఈ మచ్చలు ఏర్పడుతాయి.  చర్మానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి.  ఒక్కోసారి ఇవి పూడిపోతాయి.  ఈ రంధ్రాల ద్వారా శరీరం నుంచి మృత కణాలు బయటకు వస్తాయి.  ఈ రంధ్రాలు పూడుకుపోవడం వలన అక్కడ నల్లగా ఏర్పడి మచ్చలు ఏర్పడుతాయి.  ఇవి  ఫేస్​ పై వచ్చాయంటే చాలా ఇబ్బంది పడుతుంటారు.కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ALSO READ | Lifestyle: అలోవెరాతో అందం.... ఫేస్​ మెరిసిపోవాల్సిందే..

 గర్భధారణ, డెలివరీ తర్వాత, మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఎండ, పొడిబారిన చర్మం కూడా దీనికి కారణమే. ఈ సమస్యలకు మొదటి పరిష్కారం మంచి నీళ్లే. రోజుకి 10 గ్లాసుల నీరు తాగుతూ, గ్లాసు పచ్చి కూరగాయల రసం తీసుకుంటే ఈ మచ్చలు తగ్గుతాయి. అలాగే రోజువారీ ఆహారంలో పండ్లు భాగం చేసుకుని, మసాలా, కారం తగ్గించాలి. ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పుల్లని పెరుగులో బార్లీ పిండిని కలిపి ముద్దలా చేసి మచ్చలపై లేపనంలా పూయాలి. పదిహేను నిమిషాల తరువాత కడగాలి. ఇలా రోజూ చేస్తే మచ్చల సమస్య తగ్గుతుంది.

‌–వెలుగు, లైఫ్​–.