- కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన బీజేవైఎం నాయకులు
కామారెడ్డిటౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ఆఫీసు ముట్టడికి లీడర్లు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెయిన్ గేట్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్నంది వేణు మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్పార్టీని గెలిపిస్తే , అధికారంలోకి వచ్చి 8 నెలలు కావొస్తున్న నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. మెగా డీఎస్సీ, గ్రూప్2, 3 పోస్టులను పెంచి భర్తీ చేయాలన్నారు. జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రభాకర్, శ్రీకాంత్, లీడర్లు నరేశ్, రాజేశ్, శివ, సత్యం హరీశ్ లతో కార్యకర్తలు పాల్గొన్నారు.