ఎస్ఎల్బీసీని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి

  • బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు : ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కోరారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 

జిల్లాకు ఇండస్ట్రియల్ పార్కును మంజూరు చేయాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, పద్ధతి ప్రకారంగా ప్రక్షాళన చేయాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతుల రుణమాఫీ పూర్తికాలేదని, దీనిపై సీఎం దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా నాయకులు పోతేపాక సాంబయ్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.