కౌంటింగ్ పూర్తయ్యే దాకా అలర్ట్ గా ఉండాలి : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తేవాలని కౌంటింగ్ ఏజెంట్లకు  కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని  కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. కౌంటింగ్ ప్రారంభంలో ఈవీఎం మెషిన్ల సీళ్లను పరిశీలించాలని, కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలపై సీలు వేసి బాధ్యులైన అధికారులు సంతకాలు చేసేవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి, మీసాల చంద్రయ్య, సత్యనారాయణ, బి.ప్రవీణ్ రావు, ఎర్రం మహేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.