విహే గురుదక్షిణ క్యాంపస్​ ను సందర్శించిన బీజేపీ నేతలు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని వివేకానంద ఇన్​ స్టిట్యూట్​ ఆఫ్​ హ్యూమన్​ ఎక్స్ లెన్సీ (విహే) గురుదక్షిణ క్యాంపస్​ ను బీజేపీ నేత, అంబికా దర్బార్ బత్తి అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణతో కలిసి బీజేపీ నేత దేవకి వాసుదేవ రావు సందర్శించారు. 

అక్కడి క్యాంపస్ లో ఉచితంగా టైలరింగ్, డ్రైవింగ్ శిక్షణ శిబిరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విహే కార్యదర్శి చంద్రశేఖర్, బీజేపీ నేతలు చారుగుండ్ల నరసింహమూర్తి, నకిరేకంటి వీరభద్రం, వీరవెల్లి రాజేశ్, దార్ల శంకర్ గౌడ్, టీచర్లు క్రాంతి ఉపేంద్రమ్మ , తదితరులు పాల్గొన్నారు.