అయోధ్య దర్శనానికి స్పెషల్​ ట్రైన్​లో తరలిన బీజేపీ లీడర్లు

  • జెండా ఊపి రైలును ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార

కామారెడ్డి టౌన్, వెలుగు: రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ఆధ్వర్యంలో జహీరాబాద్​ సెగ్మెంట్​ బీజేపీ లీడర్లు అయోధ్య రాముడి దర్శనానికి తరలివెళ్లారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన స్పెషల్​ ట్రైన్​ను బుధవారం కామారెడ్డిలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ..1,345 మంది రామ భక్తులు అయోధ్య దర్శనానికి బయలుదేరినట్లు చెప్పారు.

ట్రస్ట్ స్టేట్​కన్వీనర్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నీ సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. దర్శనం పూర్తి చేసుకొని ఈ నెల 26న తిరిగి కామారెడ్డికి చేరుకుంటారని చెప్పారు. బీజేపీ లీడర్లు ఆలే భాస్కర్, పైడి ఎల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, రంజిత్ మోహన్, మర్రి రాంరెడ్డి, తేలు శ్రీనివాస్, నరేందర్​ పాల్గొన్నారు.