తెలంగాణలో ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీని ఏర్పాటుచేయండి : శ్రావణి

జగిత్యాల టౌన్, వెలుగు: తెలంగాణలో ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండ్లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ)ని స్థాపించాలని కేంద్ర జౌళి, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి  గిరిరాజ్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి బీజేపీ నేత శ్రావణి కోరారు.

 గురువారం ఢిల్లీలోని ఆయన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రిని కలిసి చేనేత పరిశ్రమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి నేతన్నలకు భరోసా కల్పించడానికి కృషి చేయాలని కోరారు.