ఆమె మా ఎంపీనే.. ఆమె మాటలు పార్టీకి సంబంధం లేదు : కంగనాపై బీజేపీ వెర్షన్

 పంజాబ్, హర్యానా రైతులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రైతుల ఉద్యమాన్ని బీజేపీ అడ్డుకోకపోయి ఉంటే.. ఇండియా మరో బంగ్లాదేశ్ అయ్యి ఉండేదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. హర్యానా ఎన్నికలకు ముందు.. బీజేపీ ఎంపీగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ డిఫెన్స్ లో పడింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం లేఖలు విడుదల చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

రైతులు తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమం చేస్తున్నారు.  ఈ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రౌతు సంచలన వ్యాఖ్యలు చేశారు.  అయితే ఆమె వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ పెద్దలు ఆమె వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని తేలచ్చిచెప్పారు.  సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్,  సబ్కా ప్రయాస్  అనే సూత్రాల ఆధారంగా అందరినీ కలుపుకొనిపోయేందుకు  బీజేపీ  కట్టుడి ఉందన్నారు.  

బీజేపీ ఎంపీ కంగనా ఏమందంటే....

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగి రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు.  మండిలో జరిగిన రైతు ఆందోళనపై బీజేపీ ఎంపీ కంగనా రౌతు ఎక్స్​ ట్విట్టర్​ లో స్పందిస్తూ.. రైతుల ఉద్యమం కారణంగా అత్యాచారాలు.. హత్యలు జరుగుతున్నాయన్నారు.  అయి తే ఈ ప్రకటనను బీజేపీ పార్టీ తప్పుపడుతుంది. 

కాంగ్రెస్​ స్పందన..

ఇక కంగనా వ్యాఖ్యలను  కాంగ్రెస్​ పార్టీ స్పందించింది.   కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే తీవ్రంగా వ్యతిరేకించారు. భారత దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని మోదీ ప్రభుత్వం భావిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు.  రైతుల ఉద్యమాన్ని అవమానపరుస్తూ... అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి రైతులను దూషించే విధంగా మాట్లాడటం బీజేపీ ఎంపీ కంగానాకు తగదన్నారు. ఎంపీ కంగనా తప్పుడు ఆరోపణలు చేసినట్లు రుజువైతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. 
 రైతులను హంతకులుగాను... అత్యాచారం చేసే వారిగా పోల్చడంపై బీజేపీ ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్​ నాయకురాలు సుప్రియా డిమాండ్​ చేశారు.