ప్రతి ఆరు నెలలకు జాబ్ మేళా : సంకినేని వెంకటేశ్వర రావు

  •     బీజేపీ సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు

సూర్యాపేట, వెలుగు : తాను గెలిస్తే స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి ఆరు నెలలకోసారి  జాబ్‌‌‌‌ మేళా ఏర్పాటు చేస్తామని బీజేపీ సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు హామీ ఇచ్చారు. సోమవారం పట్టణంలోని  వీవీ ఎంక్లేవ్ టౌన్‌‌‌‌షిప్‌‌‌‌తో పాటు కుడకుడ రోడ్డు నుంచి శంకర్ విలాస్ వరకు ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రస్తుత పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓటర్లును మోసం చేశారని మండిపడ్డారు.

ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తారని, ఎన్నికల ముగిసిన తర్వాత కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. బీజేపీని ఆదరిస్తే  అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఆహార భద్రత కార్డు, గర్భిణులు, బాలింతలకు రూ.15వేల ఆర్థిక సాయం చేస్తామని, వృద్ధులు, వితంతువులు,  దివ్యాంగులతోపాటు  చేనేత, కల్లుగీత కార్మికులు,  ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్లకు కూడా పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.  

నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని పేదలందరికి ఇల్లు కట్టించే బాధ్యత తనదేనని, ఒక్క సారి  అవకాశం ఇస్తే  సూర్యాపేటకు  రైల్వే మార్గం తీసుకొస్తానని ప్రకటించారు.