భారతీయ వ్యాపారవేత్తకు హలో హక్కులు

న్యూఢిల్లీ: బియా బ్రాండ్స్ ఫౌండర్​ సుధాకర్ అడప..లైఫ్​ స్టైల్​ మ్యాగజైన్లు ‘హలో’, ‘హలో అరేబియా’ హక్కులను దక్కించుకున్నారు. ఈ రెండు పత్రికలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ,  సెలబ్రిటీ మ్యాగజైన్‌‌‌‌‌‌‌‌లు అని తెలిపారు. గల్ఫ్​ దేశాలలో వీటికి ఎంతో ఆదరణ ఉందని వివరించారు.  హలో, ఇండో-అరేబియాలు ఇంగ్లిష్​, అరబిక్​ భాషల్లో ప్రచురితమవుతాయి.