ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి బర్త్ డే వేడుకలు

మిర్యాలగూడ, వెలుగు : నాగార్జునసాగర్ నియోజకవర్గ  ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి బర్త్ డే వేడుకలు మంగళవారం రాత్రి  రాష్ట్ర యూత్ కాంగ్రెస్ లీడర్​ మిట్టపల్లి వెంకటేశ్​  ఆధ్వర్యంలో సాగర్ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడారు.    నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతూ... లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను వర్తింప చేస్తున్న  ఎమ్మెల్యే జై వీర్ రెడ్డికి ప్రజలంతా నిరంతరం అండగా ఉండాలన్నారు.   ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ నేతలు ఉన్నారు.