మహిళలకు గుడ్ న్యూస్.. మహిళలకోసం కొత్త పథకం..ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందే పథకం.. ఫుల్ టైం లేదా పార్ట్ టైం పనిచేస్తూ సంపాదించే పథకం.. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం..అదే ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకం.. ఈ పథకాన్ని ప్రధాని మోది డిసెంబర్ 09, 2024న హర్యానాలో మొదటగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే.. టెన్త్ పాసయితే చాలు. ఇంతకీ పథకం ఏంటిది.. ఈ పథకం ద్వారా ఎలా ఆదా యం వస్తుందో.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం LIC బీమా సఖీయోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వరా 10 వతరగతి పాసైన 18 నుంచి 70 యేళ్ల మధ్య మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా ద్వారా మూడేళ్ల పాటు ఎల్ ఐసీ బీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు. ఈ పథకంలో మహిళలను బీమా సఖీ అని పిలుస్తారు. ఈ మూడేళ్ల కాలంలో నెలకు కొంత డబ్బు చెల్లిస్తారు. మహిళలు వారి ప్రాంతాల్లో ఎల్ఐసీ ఏజెంట్లు పనిచేయాల్సి ఉంటుంది.
బీమా సఖి యోజన పథకం ప్రయోజనాలు
IC బీమా సఖి (MCA స్కీమ్) కింద ఎంపికైన మహిళలకు మూడేళ్ల శిక్షణలో మొత్తం రూ.2 లక్షలకు పైగా లభిస్తుంది. ఇందులో మొదటి ఏడాది నెలకు రూ.7 వేలు, రెండో ఏడాది రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేలు అందుతాయి. ఇందులో బోనస్ కమీషన్లు ఉండవు. దీని కోసం మహిళలకు విక్రయించే పాలసీలలో 65 శాతం వచ్చే ఏడాది చివరి వరకు యాక్టివ్‌గా (ఇన్-ఫోర్స్) ఉండాలనే షరతు ఉంటుంది.
ALSO READ | ప్రభుత్వ ఉద్యోగులకు బౌద్ధంలోకి నో ఎంట్రీ.. బౌద్ధం స్వీకరించే వారు చేయాల్సినవి ఇవి..
బీమా సఖీ పథకం కింద మూడేళ్ల శిక్షణ తర్వాత మహిళలను ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమిస్తారు. ఈ శిక్షణ కాలంలో మహిళలకు కొంత డబ్బు కూడా లభిస్తుంది. అదే సమయంలో, బీఏ పాస్ అయిన బీమా సఖీలు.. ఎల్ ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశం పొందవచ్చు.
అంటే ఒక మహిళ మొదటి సంవత్సరంలో 100 పాలసీలను విక్రయించినట్లయితే, రెండవ సంవత్సరం చివరి నాటికి వీటిలో 65 పాలసీలు అమలులో ఉండాలి. ఏజెంట్లు పాలసీలను విక్రయించడమే కాకుండా వాటిని నిలుపుకోడానికి కూడా ప్రయత్నిస్తారని నిర్ధారించడం దీని లక్ష్యం.
బీమా సఖికి ఎలా దరఖాస్తు చేయాలంటే..
- LIC అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/test2ని వెట్ సైట్ లోకి వెళ్లాలి.
- దిగువన కనిపించే బీమా సఖిపై క్లిక్ చేయాలి.
- పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID , చిరునామా వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
- మీరు LIC ఇండియా ఏదైనా ఏజెంట్/డెవలప్‌మెంట్ ఆఫీసర్/ఉద్యోగి/మెడికల్ ఎగ్జామినర్‌కు సంబంధించినవారైతే, అదే సమాచారాన్ని అందించండి.
- చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Submit బటన్ పై క్లిక్ చేయాలి.