భిక్కనూరు, వెలుగు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పార్కు చేసిన బైక్ను మల్లుపల్లి గ్రామానికి చెందిన పల్లపు గట్టు మల్లయ్య జులై 30న దొంగిలించాడు. ఎస్ఐ సాయికుమార్ వివరాల ప్రకారం.. సోమవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద వెహికల్స్ తనిఖీ చేస్తుండగా మల్లయ్య
అనే వ్యక్తిని అనుమానంతో చెక్ చేయగా.. భిక్కనూరులో రెండు బైకులు, సిద్దిపేటలో మరో బైక్ దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కామారెడ్డి సబ్ జైల్ కు పంపి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.