బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొంగకు ఏడాది జైలు శిక్ష

​నందిపేట, వెలుగు : బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోరీ చేసిన దొంగకు ఏడాది  జైలు శిక్ష పడింది. వివరాలిలా ఇలా ఉన్నాయి.2023 డిసెంబర్​ 9న సిద్దిపేట జిల్లా ఖానాపూర్​ గ్రామానికి చెందిన  గోపాల వంశీ.. నందిపేట మండల కేంద్రంలో తిమ్ముల పోశెట్టి కి చెందిన బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దొంగిలించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కేసును విచారించిన ఆర్మూర్​ జ్యుడిషియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెజిస్ట్రేట్​ వేముల దీప్తి నిందితుడికి ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.