ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారుల బిగ్ షాక్ ఇచ్చారు. అద్దె బకాయిలు రూ. 2.50కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు. షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు ఆర్టీసీ అధికారులు. షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణదారులను బయటకు పంపించేశారు ఆర్టీసీ అధికారులు. వెంటనే షాపింగ్ మాల్ ఖాళీ చేయాలంటూ దుకాణదారులను హెచ్చరించారు ఆర్టీసీ అధికారులు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున ఆర్మూర్ ఆర్టీసీ స్థలంలోని జీవన్ రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 2013లో విష్ణుజిత్ ఇన్ఫ్రా పేరిట 33 ఏళ్ల కు లీజ్ కు తీసుకున్న స్థలాన్ని 2017లో జీవన్ రెడ్డి సతీమణి ఓవర్టేక్ చేసుకున్నట్లు చెప్పారు. అప్పటి నుంచి రూ.2.51 కోట్ల బకాయి పెండింగ్ ఉందన్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మాల్ సీజ్ చేశామన్నారు సజ్జనార్.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని #TSRTC యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపం లోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 16, 2024
2012లో ఆర్మూర్ ఆర్టీసీకి చెందిన స్థలాన్ని జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి.. విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరిట లీజుకు తీసుకున్నారు. తర్వాతి కాలంలో స్థలాన్ని అదే సంస్థకు కేటాయిస్తూ ఆర్టీసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. రజితరెడ్డి పలు బ్యాంకుల్లో లోన్ తీసుకుని.. ఆ ల్యాండ్‌లో ఐదు అంతస్థుల విశాలమైన మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. సినిమా హాల్స్, ఇతర సంస్థలకు రెంట్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బకాయిలు రూ.7 కోట్ల 23 లక్షల71 వేల 807కు చేరుకున్నాయి. ట్రాన్స్‌కో బకాయిలు రూ.2 కోట్ల 57 లక్షల 20 వేల 2కు పెరిగాయి.