కాంగ్రెస్ తోనే బీసీలకు ​న్యాయం : చామల కిరణ్​కుమార్​రెడ్డి 

  • ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి 

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​సర్కారుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి అన్నారు. అందుకోసమే సర్కారు బీసీ కమిషన్​ ఏర్పాటు చేసిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్​లో జరిగిన బీసీ కమిషన్​చైర్మన్​జీ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, బాలలక్ష్మి, సురేందర్ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని ప్రస్తావించారు. ఇచ్చినమాట నిలబెట్టుకుంటామని చెప్పారు.

బీసీ కమిషన్​ కూర్పులో భువనగిరి పార్లమెంట్​కు పెద్దపీట వేసిన సీఎం రేవంత్​ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్​పరిధిలోని మునుగోడు నియోజకవర్గం నుంచి రాపోలు జయప్రకాశ్, జనగామ నుంచి రంగు బాలలక్ష్మిని మెంబర్లుగా నియమించారని తెలిపారు. వీరిద్దరూ అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం కృషి చేశారని చెప్పారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నాయకుడు పోత్నక్​ ప్రమోద్​కుమార్ ఉన్నారు.