రైతులు కొనుగోలు సెంటర్లలోనే వడ్లు అమ్మాలి : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి

  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం 

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి సూచించారు. బీబీనగర్​ మండలం బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి, భట్టుగూడెం, గుర్రాలదండి, పెద్దపలుగుతండ, వలిగొండ మండలం పహిల్వాన్ పూర్, పొద్దుటూరు, ఏదుళ్లగూడెం, వలిగొండ, వెలివర్తిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

నిబంధనల ప్రకారం రైతులు వడ్లను తేమ, తాలు లేకుండా సెంటర్లకు తేవాలన్నారు. సెంటర్ల నిర్వాహకులు కూడా తేమ, తాలు పేరుతో కోత విధించకుండా బస్తాకు 41 కిలోలే తూకం వేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెంటనే గోదాములకు తరలించాలని సూచించారు.