సాగు భూములకు రైతు భరోసా

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు: గత ప్రభుత్వ పాలకులు రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతుబంధు పేరుతో కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగు చేస్తున్న వ్యవసాయ భూములకే రైతు భరోసా వర్తింపజేస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. 

సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఎమ్మెల్యే పర్యటించి, పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవన్ లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, మాజీ జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, పార్టీ మండల ప్రెసిడెంట్ కోటగిరి సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.