నారాయణ పూర్ గ్రామంలో .. ధ్యాన మందిరానికి భూమిపూజ

నవీపేట్, వెలుగు: మండలంలోని నారాయణ పూర్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణరెడ్డి మాట్లాడుతూ..  గ్రామానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ కిశోర్ రావు ధ్యాన మందిరానికి స్థలాన్ని ఇవ్వడం పట్ల ఆయనను అభినందించారు.

 ప్రతి మనిషి శాకాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఇందిరా భాస్కర్ రావు విశ్రాంత పంచాయతీ అధికారి దయానంద్ గ్రామ ఇన్‌‌చార్జి లక్ష్మణ్ గ్రామస్తులు  పాల్గొన్నారు