ఫ్లై ఓవర్ల నిర్మాణానికి నేడు భూమిపూజ

  • హాజరుకానున్న మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ 

మిర్యాలగూడ, వెలుగు : పట్టణంలోని రామచంద్రగూడెం వై జంక్షన్, నందిపాడు, చింతపల్లి, ఈదులగూడ బైపాస్ జంక్షన్ల వద్ద నూతన ఫ్లై ఓవర్ల నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కార్యక్రమానికి ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్​రెడ్డి, ఎమ్మెల్యే వీరేశం హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం  మహబూబాబాద్​లోని వరద బాధితులకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.