భిక్కనూరు బస్టాండ్ లో సౌకర్యాలు కరవు

  • రోడ్డుపైనే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు 
  • తాగునీరు, మరుగుదొడ్లు లేక తిప్పలు 

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు ఆర్టీసీ బస్టాండ్ లో కరెంట్, తాగునీరు, మరుగు దొడ్లు లాంటి సౌకర్యం లేక ప్రజలు రోడ్లపైనే బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.  44 జాతీయ రహదారి పక్కన ఉన్నా కూడా ప్రయాణికులకు శాపంగా మారింది. మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి లాంటి ప్రాంతాలకు వెళ్లే బస్సులు గతంలో ఇక్కడి నుంచే వెళ్లేవి. బస్టాండ్ లో సౌకర్యాలు కరవవడంతో బస్సులు రావడం లేదు. 

కనీసం బస్టాండ్ లో ఎవరూ నిలబడలేని పరిస్థితి. రోడ్డు పైనే ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. గత మండల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి సమస్య గురించి తెలిపారు. వారంలో బస్టాండ్ లో మౌలిక వసతుల పనులు షురూ చేస్తామని ఆర్టీసీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతు  పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు.