మునుగోడు నియోజకవర్గానికి రావడం అంటే తన సొంత నియోజకవర్గం మధిర నియోజకవర్గానికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నమ్మిన వ్యక్తి కోసం ఏ స్థాయికైనా వెళ్లి కొట్లాడ గల వ్యక్తి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తమకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే కష్ట కాలంలో రాజగోపాల్ రెడ్డి తన వెంట ఉంటూ ధైర్యాన్ని ఇచ్చాడన్నారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో భట్టి ఈ కామెంట్స్ చేశారు. భువనగిరి లోక్ సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేశామన్న భట్టి.. రైతుబంధు కూడా విడతలవారీగా అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు.