యాదగిరిగుట్ట ఈవోగా భాస్కర్ రావు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి ఈవోగా పనిచేస్తున్న రామకృష్ణారావు బదిలీ కావడంతో.. ఆయన ప్లేస్ లో భాస్కర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

అనంతరం  భాస్కర్ రావుకు అలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.   భాస్కర్ రావు గతంలో యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా  బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవోలు గజవెల్లి రమేశ్ బాబు, రఘు, శ్రావణ్ కుమార్, రామ్మోహన్, సూపరింటెండెంట్ రాజన్ బాబు తదితరులు ఉన్నారు.