త్వరలో భారత్‌ డోజో యాత్ర.. హింట్ ఇచ్చిన రాహుల్ గాంధీ

ఆగష్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సరికొత్త లుక్‌లో కనిపించారు. పిల్లలతో కలిసి మార్షల్ ఆర్ట్స్ మెళుకువలు సాధన చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

ALSO READ | ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

వీడియోలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ జియు-జిట్సు టెక్నిక్‌ని ఉపయోగించి ప్రత్యర్థి ఆటగాళ్లను ఓడించడం కనిపిస్తోంది. అందునా, రాహుల్ ఐకిడోలో బ్లాక్ బెల్ట్, జియు-జిట్సులో బ్లూ బెల్ట్ అని చెప్పడం కూడా వినవచ్చు. ఈ ప్రత్యేక వీడియో ద్వారా కాంగ్రెస్ ఎంపీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూనే.. త్వరలో 'భారత్ డోజో యాత్ర' ఉండవచ్చని హింట్ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేలా.. 

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేలా రాహుల్ గాంధీ తన పంథాను మార్చుకుని ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తూ భారత్ జోడో యాత్రను నిర్వహించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి గుజరాత్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రల ఫలితంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొంత ప్రయోజనం చేకూరిందనిచెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆయన మరోసారి డోజో యాత్ర పేరుతో ప్రజలతో మమేకం కానున్నారు.