వృథాగా మిషన్ భగీరథ నీరు

బీర్కూర్, వెలుగు : బీర్కూరు మండల కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాల వద్ద గల మంచినీటి ట్యాంకుకు మిషన్ భగీరథ పైపు లైన్ కనెక్షన్ ఇచ్చారు.  భూమిలో నుంచి పైప్ లైన్ వేయాల్సి ఉండగా,  భూమి పై నుంచి పైప్​లైన్​ వేసి ఆఫీసర్లు చేతులు దులుపుకున్నారు.

నీటి ఒత్తిడికి సోమవారం ఆ పైప్ లైన్ ఊడిపోయి నీరంతా వృథాగా పోతుంది. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తాగునీరు వృథా అవుతుందని ప్రజలు మండిపడుతున్నారు. వారి పనితీరుపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు.