Lifestyle: కోపం గురించి భగవద్గీతలో ఏముందో తెలుసా.. 

మనలో పుట్టే సహజమైన భావోద్వేగాల్లో.. కోపం కూడా ఒకటి. వాటిలో అన్నింటికన్నా ప్రమాదకరమైంది కోపమే. కంట్రోల్ చేయకపోతే.. కష్ట నష్టాలకు కారణమవుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగిన వాళ్లనైనా.. కోపం సర్వనాశనం చేస్తుందని వేల ఏళ్ల కిందే.. భగవద్గీత చెప్పింది.

ఎలా జయించాలి?

కోపం రాకుండా ఉండాలంటే.. ఎలా ఉండాలో గీతలో చాలా శ్లోకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా.. రాగ ద్వేషాలకు దూరంగా ఉండాలి. ఇంద్రియాల్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే.. అప్పుడు ఏ కోపం మనల్ని లొంగదీయదు. మరి రాగద్వేషాలకు లొంగకుండా... కోపానికి లొంగకుండా ఉండాలంటే.. ఎలాంటి టెక్నిక్స్ ఫాలో కావాలి? మీరు ఎవరితోనైనా.. ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే మాట్లాడే ప్రయత్నం చేయండి. అవతలి వ్యక్తి మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి. కోపం వచ్చినప్పుడు వీలైనంత ఆలస్యం చేయాలి. లేదా ఆ సందర్భాన్ని వాయిదా వేయాలి. అప్పుడు అటోమెటిక్ గా కోపం తగ్గుతుంది.

కోపంతోనే నాశనం

ఏదైనా ఒక విషయం గురించి నిత్యం ఆలోచిస్తే ఏమవుతుంది? ఆ విషయంపై మానసిక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ముదిరి.. అది నాకు కావాలి. అది లేకపోతే ఎలా? అది లేకుండా జీవించడం ఎలా? అనిపిస్తుంది. కోరిక కలిగినప్పుడు దాన్ని తీర్చుకోవాలని, దాన్ని పొందాలనిపిస్తుంది. అందుకు అడ్డు తగిలిన వాళ్లపై కోపం కలుగుతుంది. కోపానికి లొంగిపోతారు, ఇది అనొచ్చు.. ఇది ఇలా అనకూడదు అనే వివేకం కోల్పోతారు. ఇతను నా వాడు, నా ఫ్రెండ్, నాన్న, అమ్మ అనే సంగతి కూడా మర్చిపోతాడు. తర్వాత జ్ఞాపకశక్తి కూడా నశించిపోతుంది. దేన్ని జ్ఞాపకం పెట్టుకోవాలో మర్చిపోతారు. దీంతో బుద్ధి వక్రీకరించి వివేకం కోల్పోతాడు. అంటే మొదట కోరిక, దాని వల్ల కోపం, దాని వల్ల జ్ఞానం కోల్పోయి.. సర్వం కోల్పోతాడన్నమాట. ఇదే భగవద్గీతలో చెప్పారు.