రూ. కోట్లు పెట్టి కట్టిన్రు..ఓపెనింగ్ మరిచిన్రు!

  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ. 4.50కోట్లతో నాలుగు చోట్ల  లైబ్రరీల నిర్మాణం
  • టెండర్​ ఫైనలైనాబుక్స్, ఫర్నీచర్ రాకపోవడంతో ప్రారంభంలో జాప్యం
  • మణుగూరులో కొత్తది ఓపెన్​ అయినా పాత గ్రంథాలయంలోనే కొనసాగింపు 
  • ఖాళీగా కొత్తగూడెం, ఇల్లెందు, చర్ల లైబ్రరీ న్యూ బిల్డింగ్​లు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు ఇల్లెందు, చర్ల, మణుగూరు ప్రాంతాల్లో గతేడాది రూ. 4.50 కోట్లతో లైబ్రరీ బిల్డింగ్​లను నిర్మించారు. కానీ ఇంకా ప్రారంభించడం లేదు. మణుగూరులో ప్రారంభించినా పాత బిల్డింగ్​లోనే గ్రంథాలయం కొనసాగుతోంది. అన్ని లైబ్రరీల్లో టెండర్​ ఫైనలైనా బుక్స్, ఫర్నీచర్ రాకపోవడంతో ప్రారంభంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త బిల్డింగ్​లు ప్రారంభం కాకపోవడంతో పాత  బిల్డింగ్​ల్లోనే లైబ్రరీలు కొనసాగుతుండడంతో పాఠకులు ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ పరిస్థితి.. 

గ్రంథాలయాల్లో నిరుద్యోగులు, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, చర్ల ప్రాంతాల్లో కొత్త బిల్డింగ్​లను నిర్మించారు. ఇల్లెందు, మణుగూరు, చర్ల ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ. కోటి చొప్పున, కొత్తగూడెంలో రూ. 1.50కోట్లతో లైబ్రరీల కోసం కొత్త బిల్డింగ్​లను కట్టారు.

మణుగూరులో నిర్మించిన బిల్డింగ్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తి కావడంతో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. బిల్డింగ్​ నిర్మించారే తప్ప పూర్తి స్థాయిలో ఫర్నీచర్​, బుక్స్​ రాకపోవడంతో పాత లైబ్రరీలోనే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. 

కొత్తగూడెంతో పాటు ఇల్లెందు, చర్ల ప్రాంతాల్లో బిల్డింగ్​లు పూర్తై మూడు నెలలు దాటుతున్నా ఇవి కూడా ఫర్నీచర్​, బుక్స్​  ఏర్పాటు చేయకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. కొత్తగా నిర్మించిన లైబ్రరీలకు అవసరమైన ఫర్నీచర్​, కాంపిటేటీవ్​ బుక్స్​ కోసం దాదాపు రూ. 65లక్షలతో అధికారులు టెండర్లు పిలిచారు.  టెండర్లు పూర్తై రెండు నెలలు దాటినా ఫర్నీచర్ 

బుక్స్​ గ్రంథాలయాలకు చేరుకోలేదు. దీంతో పాత గ్రంథాలయాల్లో ఇరుకు గదుల్లోనే పాఠకులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగూడెంలోని పాత గ్రంథాలయం ఆవరణ చిన్న వానకే కుంటలా మారుతోంది. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి త్వరగా లైబ్రరీ బిల్డింగ్​లను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.