మొక్కలు నాటాలి..సంరక్షించాలి : కలెక్టర్ జితేశ్​

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​

చుంచుపల్లి, వెలుగు : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. సంరక్షించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం బయట ప్లాంటేషన్ ఏర్పాటు కుస్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అక్కడ 1.5 ఎకరాల ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఖాళీ ప్రదేశాన్ని మూడు భాగాలుగా విభజించి ఔషధ, సుందరీకరణ మొక్కలు, భారీగా పెరిగే వృక్షాలను నాటాలని సూచించారు. వర్షం నీరు నిలవకుండా, నీరు భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషంజన్ స్వామి, మున్సిపల్ డీఈ రవి కుమార్, 8,9 వార్డు కౌన్సిలర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

కొత్త ఉత్సాహంతో పనిచేద్దాం

భద్రాద్రికొత్తగూడెం : జిల్లా అభివృద్ధికి కొత్త ఉత్సాహంతో పనిచేద్దామని కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లా ఆఫీసర్లంతా సమన్వయంతో కొత్త ప్రణాళికలతో జిల్లాను డెవలప్​మెంట్​ చేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడ్తున్న సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కోరారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకంతో పాటు విద్యా పరంగా జిల్లా మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.