చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. అందుకే మన జీవితంలో భాగమయ్యాయి. కొందరు పాటలు వింటూ, మరికొందరు వీడియోలు చూస్తున్నారు. అయితే వాటితో ఉపయోగాలేమోకానీ.. అనారోగ్య సమస్యలకు గురిచే స్తుంది. అదే పనిగా పాటలు వింటుంటారు. చాలామంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా సౌండ్ బయటకు వస్తోందంటే.. అవసరాని కి మించి వాల్యూమ్తో వింటున్నట్టే. ఎక్కువ సౌండ్ పాటలు వినడం వల్ల చెవిలోని పొర, నరాలపై ప్రభావం పడుతుంది.
చెవి పొర శబ్ద తరంగాలను మెదడుకు చేరవేస్తుంది. చెవుల్లోపలికి దూరి ఉండే హెడ్ ఫోన్స్ వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. హెడ్ ఫోన్స్ షేరింగ్ వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి చెవి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఇతరుల హెడ్ఫోన్లు వాడుతూ ఉండే వారి చెవులను పరీక్షించినప్పుడు వాళ్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ప్రయోగాల్లో తేలింది. హెడ్ఫోన్ వాడకం వల్ల చెవుల్లో తలెత్తే వేడి, తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
ALSO READ :- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు
తరచుగా ఇయర్ బడ్స్ మారుస్తూ ఉండాలి. ఇతరులతో హెడ్ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసు కోకూడదు. అలాగే తక్కువ మోతాదులో మ్యూజిక్ వింటూ గంటకోసారి చెవులకు విశ్రాంతి ఇవ్వాలి.