బెట్టింగ్​ యాప్​ నిర్వాహకుల అరెస్ట్

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గురువారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పట్టుబడ్డారు. ఎస్‌ఐ జె. నరేశ్ ఆధ్వర్యంలో వెహికల్‌ చెక్‌ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి కారు అనుమానస్పదంగా కనిపించడంతో కారును చెక్‌ చేశారు. కారులో రూ.33.10 లక్షల నగదు ఉన్న బ్యాగును గుర్తించి, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు.

ఆ సొమ్ము బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించినట్టు చెప్పారు. వీరిని ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన నిమ్మ ధనుంజయ్, గోదావరిఖనికి చెందిన ముల్కల రాజ్ కుమార్, చిన్నపల్లి అభిలాష్ పై కేసు నమోదు చేసినట్టు అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్ తెలిపారు. కారుతోపాటు ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు.