అన్నా చెల్లెల్ల అనురాగ బంధం మరింత బలపడే రోజు.. అమ్మ చూపించే ప్రేమ, నాన్న కనబరిచే భద్రత కలిపి ప్రతిబింబించే రూపం అన్న. రాకా అంటే నిండు పున్నమి. నిండుపున్నమి రోజు ధరించే రక్షకు రాఖీ అని పేరు. ఈ రక్షాబంధనంలో దాగిన మూడు పోగుల దారం..మూడు ముడులు...ఆరోగ్యం, ఆయువు, సంపదకు సంకేతం. రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..
ఆగష్టునెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఏరోజు వచ్చిందా అని కేలండర్ తిరగేస్తారు. రక్త సంబంధం ఉన్నా.. లేకున్న అక్కా తమ్ముళ్లుగా బంధాలని పంచీ పెంచే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ ఇది. మీ సోదర సోదరీమణులకు అర్థవంతమైన శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు పండగ రోజు రాఖీ పండగ శుభాకాంక్షలకు సంబంధించిన ప్రత్యేక సందేశాలు, మెసేజీలు, మీ తోబుట్టువులతో పంచుకోండి.
అమ్మలో అనురాగం..నాన్నలో ప్రేమ
కలగలిపిన బంధం ఇది..
రక్షాబంధన్ శుభాకాంక్షలు
నన్ను ఆటపట్టించే అల్లరోడు
సంతోషాన్ని కలిగించే స్నేహితుడు
అనుక్షణం అండగా నిలిచే బంధం
రక్షాబంధన్ శుభాకాంక్షలు
చిరునవ్వుకు చిరునామావి
మంచిమనసుకి మారురూపానివి
మమతలకు ప్రాకారానివి
ఆప్యాయతకు నిలువెత్తు రూపానివి
రక్షాబంధన్ శుభాకాంక్షలు
సోదరుడిని మించిన ధైర్యం.. సోదరిని మించిన స్నేహితులు
ఎవరూ ఉండరు..హ్యాపీ రక్షా బంధన్
అలకలు, పోట్లాటలు ,బుజ్జిగింపులు, ఊరడింపులు
ఏళ్లు గడిచినా చెదరని బంధం
రాఖీ పండుగ శుభాకాంక్షలు
అక్కా తమ్ముళ్ల అనురాగబంధం .. అన్నా చెల్లెళ్ల ఆప్యాయ బంధం
అదే రక్షా బంధనం...హ్యాపీ రక్షా బంధన్
అమ్మలా అనురాగం పంచావు..నాన్నలా లాలించావు
నువ్వే నా ధైర్యం అన్నయ్య...
రాఖీ పండుగ శుభాకాంక్షలు
అపురూపమైన అన్న చెల్లెళ్ల అనుబంధం
ఆప్యాయతకు ప్రతిరూపం
రాఖీ పండుగ శుభాకాంక్షలు
ఒకే కడుపున పుట్టకపోయినా ప్రేమను పంచిన
సోదరులు, సోదరీమణులు అందరకీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
నా జీవితంలోని ప్రతి మలుపులో అండగా నిలిచే సోదరుడికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
నువ్వే నాకు రక్ష..
ఎల్లలి ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతలు
నేను కలకాలం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ
ఆదరాభిమానాలను చూపిన నా అన్న దమ్ములకు, అక్క చెల్లెళ్లకు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..
అన్న క్షేమాన్ని కోరుతూ చెల్లెలు పడే తపన.
చెల్లికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండి
భరోసా ఇవ్వాలని అన్న పడే ఆరాటం.
వీటికన్నా స్వచ్చమైన ప్రేమ.
ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా రాదు కదా...
అలాంటి అన్నా చెల్లెల అనుబంధానికి ప్రేమతో రక్షాబంధన్ శుభాకాంక్షలు.
అందమైన అనుబంధం..
అంతులేని అనురాగం.
అన్నా చెల్లెల్ల బంధం.
ప్రేమతో రక్షాబంధన్ శుభాకాంక్షలు.
ఒక్క తల్లి బిడ్డలం కాకపోయిన ..
అంత కంటే ఎక్కువ అనురాగాన్ని పంచిన
ప్రియ సోదరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు.
చిగురాకు వర్ణంలో.. చిరుకోయిల సంగీతంలా..
సుప్రభాత గీతికలో .. సుమ పరిమళ పల్లవిలా..
వసంతమై నవ్వుకోవమ్మా.. !
చిన్నారి చెల్లెమ్మా.. ప్రియమైన అక్కచెల్లెల్లు, అన్నా తమ్ములకు
రక్షాబంధన్ శుభాకాంక్షలు.
అన్నయ్యా.. చిరునవ్వుకి చిరునామానివి..
మంచి మనసుకు మారు రూపానివి..
మమతలకు ప్రాకారానివి..
అప్యాయతకు నిలువెత్తు రూపానివి!!! రక్షాబంధన్ శుభాకాంక్షలు.